GDWL: హైబ్రిడ్ పత్తి విత్తనాల సాగు, ఉత్పత్తిలో గద్వాల జిల్లా ప్రత్యేక గుర్తింపు సాధించింది. గట్టు, అయిజ, మల్దకల్, ధరూర్ తదితర మండలాల్లో రైతులు ప్రముఖ కంపెనీల కోసం విత్తన పత్తిని సాగు చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తయ్యే విత్తనాలను దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తుండటంతో గద్వాల ప్రధాన విత్తన కేంద్రంగా నిలుస్తోంది.
తెలంగాణ
'హైబ్రిడ్ పత్తి విత్తనాల్లో గద్వాల అగ్రస్థానం'


