హైదరాబాద్: 28°C
తెలంగాణ

11 నుంచి తుల్జాభవాని ఆలయంలో దసరా ఉత్సవాలు

NLG: నేరడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌లోని తుల్జాభవాని దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. పెత్ర అమావాస్యతో ఉత్సవాలు ప్రారంభమై ఉపవాస దీక్షలు, గణేశ్, హనుమాన్ పూజలు, ఖండేనవమి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కృష్ణానదిలో మంగళహారతితో ఉత్సవాలు ముగియనున్నట్లు నిర్వాహకులు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.