హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్

NZB: నగరంలోని స్థానిక వినాయకనగర్ ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ వి.భుజంగరావుతో కలిసి బుధవారం పరిశీలించారు. సాధారణ తనిఖీలో భాగంగా గోడౌన్‌కు వేసిన సీల్స్, పోలీసు బందోబస్తును పరిశీలించారు. కార్య క్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి శంకర్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.