హైదరాబాద్: 28°C
తెలంగాణ

అందరికీ తాగునీరు అందించాలి: కలెక్టర్

ADB: జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైప్‌లైన్‌ విస్తరణ, నల్లాల ఫిట్టింగ్‌ పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.