హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ 31వ యూనిట్‌లో బుధవారం టీడీపీ కార్యక్రమాన్ని యూనిట్ ఇన్‌చార్జి పాలూరి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.