హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చివరి ఆయకట్టుకు సాగునీళ్లు విడుదల'

SRD: కల్హేర్ మండలం కృష్ణాపూర్, ఖానాపూర్ ఇందిరానగర్ ప్రాంతాల్లోని రైతుల వరి పంటలకు నల్లవాగు డ్యాం ప్రధాన కాలువ ద్వారా సాగునీళ్లు వదిలినట్లు సంబంధిత ఏఈ మల్లేశం బుధవారం తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా రైతుల సూచనల మేరకు ప్రస్తుతం పారుతున్న D-4 కెనాల్ నీటిని నిలిపివేసి, చివరి ఆయకట్టు ఇందిరానగర్ ప్రాంత పంటలకు నీరందిస్తున్నట్లు చెప్పారు.