హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వంగరలో 15 సమస్యాత్మక గ్రామాలు

VZM: వంగర మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 15 సమస్యాత్మక గ్రామాలను అధికారులు బుధవారం వెల్లడించారు. లక్ష్మీపేట, శివ్వాం, శ్రీహరిపురం, ఆర్‌ఆర్ కాలనీలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. అరసాడ, తలగాం, ఎం.సీతారాంపురం, పటువర్ధనం, మడ్డువలస, కొండ చాకరాపల్లి, కింజంగి ఆర్‌ఆర్ కాలనీలు సమస్యాత్మకంగా ఉన్నాయి. సంగాం, మగ్గూరు, వంగర, శ్రీహరిపురం సున్నితమైనవిగా గుర్తించారు.