హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'తొమ్మిది నెలలుగా వేతనం అందడం లేదు'

KMR: తొమ్మిది నెలలుగా తనకు గౌరవ వేతనం అందడం లేదని నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్ సర్పంచ్ బేగరి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ఇతర గ్రామాల సర్పంచ్‌లకు క్రమం తప్పకుండా వేతనాలు మంజూరవుతున్నా, తనకు మాత్రం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదన్నారు. అధికారులు స్పందించి గౌరవ వేతనం మంజూరు చేయాలని కోరారు.