హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాచారం గురుకుల కళాశాలలో రక్తదాన శిబిరం

MBNR: జడ్చర్ల మండలం మాచారంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ నిరీక్షణ రావు హాజరై బ్లడ్ క్యాంప్‌ను ప్రారంభించారు.రక్తదానం చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.