హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా మారిన రోడ్డు పక్కన బావి

PDPL: ఓదెల మండలం పోత్కపల్లి-కాల్వశ్రీరాంపూర్ ప్రధాన రహదారిలో జీలకుంట వద్ద రోడ్డు ఆనుకుని ఉన్న బావి ప్రమాదకరంగా మారింది. చుట్టూ గోడ, కంచె లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళ ప్రమాదాలు జరిగే ముప్పు ఉందంటున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు మేల్కొని రక్షణ ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.