హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూరగాయల మార్కెట్‌లో పర్యటిస్తున్న MLA

BDK: ఇల్లందు కూరగాయల మార్కెట్ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం సందర్శించారు. మార్కెట్‌లో వ్యాపారుల వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యాపార పరిస్థితులు, లాభనష్టాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు అధికారులు పాల్గొన్నారు.