WNP: మండల నూతన విద్యాధికారి శాంతన్నను తపస్ మండల ఉపాధ్యాయ బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. విద్యాభివృద్ధికి తపస్ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం ఎంఈవోను పూలమొక్కతో స్వాగతించి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో వరప్రసాద్ గౌడ్, శశివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ఎంఈవో శాంతన్నకు తపస్ ఉపాధ్యాయుల అభినందన'


