SRCL: జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్‌లో బుధవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 316.38 మీటర్లుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిల్వ 23.533 TMCలుగా ఉంది. గతేడాది ఇదేరోజు 317.80 మీటర్లు, 27.042 TMCల నిల్వ ఉంది. ప్రస్తుతం దానితో పోల్చితే ఇప్పుడు 3.5 TMCలు తక్కువగా నమోదైంది. రోజులు గడుస్తున్న కొద్దీ నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
మిడ్ మానేర్‌లో నీటి నిల్వ ఎంతంటే!


