హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతుల ఆందోళన

SDPT: రాయపోల్ మండలం గుర్రాలసోఫా వద్ద చేగుంట - గజ్వేల్ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ రామారామ్, ఇందుప్రియల, వడ్డేపల్లి తదితర గ్రామాల రైతులు రోడ్డెక్కి గంటల తరబడి రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ విద్యుత్తు మూడు గంటలకు మించి రావడంలేదని ఆరోపిస్తూ రాస్తారోకో చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తానని ఏఈ హామీతో విరమించారు