హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

AKP: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. బుధవారం నర్సీపట్నం స్పీకర్ క్యాంపు కార్యాలయంలో 7 మంది బాధితులకు రూ.12.39 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలో 333 మందికి రూ.2.90 కోట్ల ఆర్థిక సాయం అందించామని తెలిపారు.