హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి రైతులకు భారీ నష్టం

NLG: జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి పంట దెబ్బతింది. సాగునీరు అందక, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పూత, ఖాత దశలోనే పంట ఎండిపోయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5.55 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, సుమారు 80 శాతం మేర పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చేతికి వచ్చిన పంట కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.