హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు రానున్న రాష్ట్రపతి

కృష్ణా: అక్టోబర్ 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విజయవాడలోని ఇంద్రకీలాద్రిని సందర్శించి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అలాగే పున్నమి ఘాట్ వేదికగా జరిగే నేషనల్ సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్‌ కార్యక్రమాలకు హాజరవుతారని ఉన్నత అధికారులు తెలియజేశారు.