హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైలులో పొగలు.. తప్పిన ప్రమాదం

HYD: కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌కు బీబీనగర్‌ వద్ద బుధవారం ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌ నుంచి వెళ్తుండగా ఓ బోగీలో పొగలు వచ్చాయి. దీంతో వెంటనే రైలును ఆపగా, భయాందోళనతో కొందరు కిందికి దూకారు. సాంకేతిక సమస్యల వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. రైలులో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలు ఆలస్యంగా సాగుతున్నాయి.