హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణికుల అవస్థలు

MBNR: బాలానగర్ నుంచి గంగాపూర్ వెళ్లే రహదారి అధ్వాన్నంగా మారింది. పెద్దారెవెల్లి నుంచి తిరుమలగిరి మీదుగా గంగాపూర్ వరకు కంకర పరిచి బీటీ పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై కంకర రాళ్లు, ఎత్తుపల్లాలతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉంది. వెంటనే బీటీ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.