హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. మహిళా మృతి

నెల్లూరు: దుత్తలూరు మండలం నందిపాడులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలో హైవే దాటుతున్న మహిళను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఆమె ఎగిరిపడి కాలువలో పడిపోయారు. మృతురాలు శ్రీరామ్ నగర్‌కు చెందిన తోడేటి పుల్లమ్మగా తేలింది. పాలు తీసుకుని ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.