హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్తిపాడు పోస్టాఫీసు ఉద్యోగి అదృశ్యం

GNTR: ప్రత్తిపాడు పోస్టాఫీసులో SOగా పనిచేస్తున్న మాలావత్ కోటేశ్వరరావు నాయక్ (24) అదృశ్యమయ్యారు. సెప్టెంబర్ 5న సాయంత్రం 4 గంటలకు ప్రత్తిపాడులో బస్సు ఎక్కి గుంటూరు నల్లచెరువు వద్ద వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో దిగారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లభించలేదు. సమాచారం తెలిసిన వారు ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌లో  ఫిర్యాదు చేయాలని ఎస్సై తెలిపారు.