హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

ASF: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ నుంచి కాగజ్‌నగర్‌ వస్తున్న కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌కు బుధవారం పెను ప్రమాదం తప్పింది. బీబీనగర్‌‌కు రైలు రాగానే ఓ బోగీ నుంచి దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బ్రేకులు వేయడంతో అందరూ బయటకి వచ్చి దూరంగా పరుగెత్తారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.