హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విస్తృతంగా వాహనాల తనిఖీలు

SKLM:  ఎలమంచిలి మండలం సైతారుపేట రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు బుధవారం ఉదయం వాహనాల తనిఖీని చేపట్టారు. రికార్డులను పరిశీలించి ట్రాఫిక్ నిబంధనలపై వాహన చోదకులకు అవగాహన కలిగిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. పరిమిత వేగంతో వాహనాలు నడపాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు.