హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆ గ్రామంలో వాటర్ ప్లాంటే దిక్కు

KMR: జుక్కల్ మండలం గుండూర్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. నీటి ఎద్దడిని అధిగమించేందుకు గ్రామస్తులంతా స్థానికంగా ఉన్న వాటర్ ప్లాంట్‌లో..  రూ.15 చొప్పున బాటిల్ నీటిని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. గ్రామం పక్కన వాగులో ఉన్న కొద్దిపాటి నీరు ఇంకిపోతే సమస్య తీవ్రమవుతుందన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.