హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిధులు మంజూరైనా మొద్దునిద్ర

VKB: నాగసమందర్ వెళ్లే మార్గంలోని పాత వంతెన బీటలు వారి ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.27.50 కోట్లు విడుదల చేసి 8 నెలలు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం అంగుళం ముందుకు పడలేదు. ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతూ, అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.