హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వానంగా ఆర్టీసీ డిపో రహదారి

JN: జనగామ ఆర్టీసీ బస్ డిపో నుంచి బయటకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు, బస్సు డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి దుస్థితి కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చడంతో పాటు పటిష్టమైన సీసీ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.