SKLM: అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఎమ్మెల్యే రవికుమార్ అండగా నిలిచారు. ఆమదాలవలస మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి మొత్తం రూ.7 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన సతీమణి, పొందూరు మాజీ ఎంపీపీ కూన ప్రమీల బుధవారం పంపిణీ చేశారు. బాధితుల యోగక్షేమాలు తెలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సాయం అర్హులందరికీ అందేలా కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ


