హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రతపై అవగాహన

NDL: డోన్ పాతపేటలో సబ్ డివిజనల్ శక్తి టీం సీఐ ఇంతియాజ్ భాషా ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్ వినియోగం, మహిళల భద్రత, అత్యవసర సేవలపై అవగాహన కల్పించారు. వేధింపులు ఎదురైతే 112, 100కు, చిన్నారుల సమస్యలపై 1098కు ఫోన్ చేయాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.