హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతు గుర్తింపు కార్డు నమోదు చర్యలు'

SRD: ​కంగ్టి మండలం దామరగిద్ద గ్రామంలో AEO గీత బుధవారం రైతు గుర్తింపు కార్డు నమోదు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రుణాలు, సబ్సిడీ లబ్ధి పొందేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డు కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఏఈఓ స్పష్టం చేశారు. అర్హులైన రైతులందరూ తమ ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ పుస్తకం ప్రతులతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.