హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తల్వార్లతో మైనర్ల హల్‌చల్

JN: వరంగల్ నగరంలోని కరీమాబాద్ బీరన్నగుడి ప్రాంతంలో మైనర్లు తల్వార్లతో హల్చల్ చేయడం కలకలం రేపింది. వీధి కుక్కలపై తల్వార్లతో దాడికి పాల్పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిన్న వయసులోనే మైనర్లు ఆయుధాలతో సంచరించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వారిని గుర్తించి, ఆయుధాలు అందించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.