హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త జడ్పీకి సిబ్బంది కొరత..!

కృష్ణా: జిల్లా జడ్పీ రెండుగా విడిపోవడంతో ఎన్టీఆర్ జిల్లాకు ప్రత్యేక జడ్పీ కార్యాలయం ఏర్పాటైంది. అయితే సిబ్బంది కొరత వెంటాడుతోంది. మొత్తం 34 పోస్టులు కేటాయించగా 28 మంది మాత్రమే విధుల్లో చేరారు. మిగిలిన ఆరుగురు వివిధ ప్రాంతాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. దీంతో కొత్త జడ్పీ పాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.