హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాక్టర్ నుంచి పడి యువకుడు మృతి

JGL: కథలాపూర్ తాండ్రియాల గ్రామంలో కండ్ల నాగరాజు (27) అనే యువకుడు బుధవారం ట్రాక్టర్‌ నుంచి పడి మృతి చెందాడు. నాగరాజుకు ట్రాక్టర్‌లో వెళ్తుండగా మూర్ఛ రావడంతో కిందపడ్డాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలోనే దుర్మరణం పాలయ్యాడు. మృతుడికి  ఇద్దరు పిల్లలు, భార్య గర్భవతిగా ఉంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.