హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురుగు కాలువ శుభ్రం చేయరా ఇక ?

SCRL: వేములవాడ పట్టణంలోని 17వవార్డు సెకండ్ బైపాస్ జగిత్యాల రోడ్డులో హరిహర ఫంక్షన్ హాల్ సమీపంలోని మురికి కాలువ చెత్తాచెదారంతో నిండిపోయింది. దీంతో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.