హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్‌ కోతలపై రైతుల ఆవేదన

NZB: వ్యవసాయ పంటలకు 24 గంటలు విద్యుత్ అందించాలని రైతులు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 597 వ్యవసాయ ఫీడర్లు, 49 వేల నియంత్రికల పరిధిలో 1.90 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వరి కోతకు మరో 20–30 రోజుల సమయం ఉండటంతో.. పొట్ట దశలో ఉన్న పంటలకు తడులు అందించాల్సి ఉంది. పగటిపూట 7–8 గంటలే విద్యుత్‌ సరఫరా అవుతోందని రైతులు వాపోతున్నారు.