హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా.. TGSRTC ప్రత్యేక సేవలు

HYD: దసరా సెలవులకు వెళ్లే గ్రేటర్ విద్యార్థుల కోసం TGSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హాస్టళ్లు, కాలేజీల నుంచే ఈ బస్సులు నడుస్తాయని ఈడీ సీ.వినోద్ కుమార్ తెలిపారు. అలాగే, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి కనీసం 30 మంది ప్రయాణికులు ఉంటే, వారు ఉన్న చోటకే బస్సును పంపిస్తామన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని సర్వీసులు పెంచుతామని వెల్లడించారు.