హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలుడిని చితకబాదిన ఉపాధ్యాయుడు

MBNR: కోయిలకొండ మండలం మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి విద్యార్థి జోగు రాకేష్ను ఉపాధ్యాయుడు కర్రతో చితకబాదిన ఘటన మంగళవారం జరిగింది. బాలుడు ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. ఘటనకు బాధ్యుడైన ఉపాధ్యా యుడిని సస్పెండ్ చేసి, పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ పెంచాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు.