కాకినాడ: తాళ్లపూడి మండలం తుపాకులగూడెం, రాగోలపల్లి పొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చారని MRO లక్ష్మీ లావణ్య తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. పంట పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు ప్రజలను కోరారు. పులి సంచారంతో స్థానిక రైతులు, ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పొలాల్లో పెద్దపులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన


