హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజవొమ్మంగిలో నిరుద్యోగులకు ఉద్యోగ మేళా!

ASR: రాజవొమ్మంగి మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం వద్ద ఈ నెల 9న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగులకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎల్. యాదగిరేశ్వరరావు తెలిపారు. 18 ఏళ్లు పైబడి, కనీసం 10వ తరగతి చదివిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు ఆధార్, విద్యా ధృవపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.