హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రాజధాని బస్సులో పొగలు.. ప్రయాణికుల్లో భయాందోళన

BHPL: భూపాలపల్లి డిపోకు చెందిన TS 03 Z 0513 రాజధాని బస్సులో బుధవారం తెల్లవారుజామునపొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సులో మహిళలు, చిన్నారులు ఉండటంతో ఆందోళన నెలకొంది. పొగ నుంచి తప్పించుకునే క్రమంలో ప్రయాణికులు ఎగ్జిట్‌ డోర్లను పగలగొట్టారు. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి పరిశీలించారు. పెను ప్రమాదం తప్పింది.