హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 73,629 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,525 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.5.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. 3.91 లక్షల లడ్డూ విక్రయాలు జరిగినట్లు తెలిపారు.