హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనలు ఉల్లంఘించిన ఆటో డ్రైవర్లపై కేసు నమోదు

ఆదిలాబాద్‌ 1 టౌన్ పరిధిలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలు తుంగలో తొక్కి ప్రమాదకంరగా మారిన ప్రయాణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నిందితులు సల్మాన్‌, మహేష్‌పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ సునిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని డ్రైవర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.