హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ ఉద్యమకారుడి మృతి.. నీడలేని ముగ్గురు కుమార్తెలు

MHBD: దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్దన్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. కనీసం సొంత ఇల్లు కూడా లేక టెంట్ కింద కుటుంబం జీవనం కొనసాగిస్తున్న దుస్థితి ఆ కుటుంబానికి ఏర్పడింది. ముగ్గురు కుమార్తెలు “మేం ఎలా బతకాలి నాన్నా” అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. కలెక్టర్ సత్వరమే స్పందించి సహయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.