హైదరాబాద్: 28°C
తెలంగాణ

భార్య ఆత్మహత్య కేసులో భర్తకు ఐదేళ్ల జైలు

NZB: ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లికి చెందిన వేముల సాయిలుకు భార్య మనోజ ఆత్మహత్య కేసులో నిజామాబాద్ సెషన్స్ కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనపు కట్నం కోసం సాయిలు వేధించడంతోనే మనోజ ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో రుజువైంది. దీంతో సెషన్స్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. నేర నిర్ధారణకు కృషి చేసిన పోలీస్ సిబ్బందిని సీపీ పి.సాయి చైతన్య అభినందించారు.