హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేనేత శాలువాలో దుబాయ్ రాజ కుటుంబం

సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెళ్ది హరిప్రసాద్ దుబాయ్ రాజకుటుంబానికి చెందిన ముగ్గురి చిత్రాలతో శాలువాను మగ్గంపై నేశారు. 15 రోజుల పాటు శ్రమించి దీనిని తయారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 11న దుబాయ్‌లో జరిగే ETCA బతుకమ్మ వేడుకల్లో దీనిని ప్రదర్శించి రాజకుటుంబానికి కానుకగా అందిస్తామన్నారు. దీంతో సిరిసిల్ల నేతన్నల ఖ్యాతి ప్రపంచానికి మరోసారి తెలియనుంది.