హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వికలాంగుల సంక్షేమ భవనాన్ని పూర్తి చేయాలి'

KMM: నేలకొండపల్లిలో అసంపూర్తిగా ఉన్న వికలాంగుల సంక్షేమ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొడాలి గోవింద రావుకు సంఘం నాయకులు ఇవాళ వినతిపత్రం అందజేశారు. స్పందించిన గోవింద రావు అక్కడికి వెళ్లి అసంపూర్తిగా ఉన్న నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.