KRNL: ఆదోని(M) బల్లేకల్లు గ్రామంలో చిన్నారి మృతితో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం ఇంటి ఆవరణలో కూర్చొని ఉన్న చిన్నారి మేఘనపై సిమెంట్ దిమ్మె పడడంతో తీవ్ర రక్త స్రావం కాగా.. చికిత్స కోసం ఆదోనిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారన్నారు. మేఘన పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోందని ఆ గ్రామ సర్పంచ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సిమెంట్ దిమ్మె పడి చిన్నారి మృతి


