ఏలూరు: గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న భవిరి జగదీశ్ పై PIT NDPS చట్టం కింద నిర్బంధ చర్యలు చేపట్టారు. అతనిపై గతంలో ఏలూరు రూరల్ పోలీస్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, కలిగి ఉండటం వంటి NDPS కేసులు నమోదయ్యాయి. ఏలూరు వన్టౌన్ సీఐ కె.రామకృష్ణ డిటెన్షన్ ఆర్డర్‌ను అమలు చేసి, జగదీశ్ను అదుపులోకి తీసుకొని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి రవాణాదారుడిపై PIT NDPS చట్టం..!


