హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సై నియామాలపై ఉత్తర్వులు జారీ

ASF సిర్పూర్ (టి) ఎస్సైగా వెంకటేశ్, ఇస్లాం ఎస్సైగా నరేశ్‌ను నియమిస్తూ ఎస్పీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సిర్పూర్(టి) నియోజకవర్గంలోని పలువురు ఎస్సైలు భూపాలపల్లికి బదిలీ కావడంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. మంగళవారం జారీ చేసిన మెమోలో నూతనంగా నియమితులైన ఎస్సైలు వెంటనే సంబంధిత పోలీస్టేషన్లలో విధుల్లో చేరాలని ఆదేశించారు.