హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీల సేవలు కీలకం

AKP: నాతవరం మండలం ఎంబీ.పట్నం గ్రామంలో మంగళవారం అంగన్వాడీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారుల సర్వాంగీణ వికాసం, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీల సేవలు కీలకమని BJP మండల అధ్యక్షుడు సబ్బి కుమారస్వామి హాజరై పేర్కొన్నారు. పోషకాహారం, ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.