హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

WGL: జిల్లాలోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి విశేషాభిషేకాలు నిర్వహించి, నూతన వస్త్రాలు, పుష్పాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి స్మరణతో భక్తి వాతవరణంతో నిండి పోయింది.